పకృతి అందం.. రామతీర్థం రహదారి..!
VZM: నెల్లిమర్ల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, రామతీర్థం బోడికొండ ప్రకృతి అందం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఎత్తైన కొండల మధ్య రహదారి, ఇరువైపులా పచ్చదనం సోయగం చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అందంగా ఉండే ఆ ప్రాంతాన్ని సందర్శనకు, అక్కడ ఫొటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి వాతావరణం ఆహ్లాదాన్ని ఇస్తుందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.