'బాదం పల్లి శివారులో ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయాలి'
మంచిర్యాల: జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామ శివారులో ఉన్న గోదావరి తీరంలో ప్రభుత్వమే ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో తొమ్మిది కిలోమీటర్ల వరకు ఇసుక సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో మండలంలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. బాదంపల్లి గోదావరి తీరం సెన్సిటివ్ లొకేషన్‌కు దూరంగా 12 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.