పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు

పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు

MBNR: మిడ్జిల్ మండలం వస్పుల, వల్లభురావు పల్లి తదితర గ్రామాల్లో పశు వైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మొత్తం 345 పశువులకు ఉచితంగా టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు. మూడు నెలలు నిండిన ప్రతి పశువుకు ఈ టీకా తప్పనిసరి అని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.