CPRపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల: CPR అవగాహన వారంలో భాగంగా IMA జగిత్యాల శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అంతర్గాం గ్రామంలో CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. CPR కోఆర్డినేటర్ డాక్టర్ కె. సుధీర్ కుమార్ గ్రామస్థులకు CPRపై అవగాహన కల్పించి అత్యవసర సమయంలో ఎలా ప్రాణాలు కాపాడాలి అని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ N.శ్రీనివాస్ పాల్గొన్నారు.