వైభవంగా జరుగుతున్న హనుమాన్ జయంతి వేడుకలు

వైభవంగా జరుగుతున్న హనుమాన్ జయంతి వేడుకలు

NRML: జిల్లావ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రాకతో జిల్లాలోని హనుమాన్ గుడులన్నీ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. పలు చోట్ల ఆలయ కమిటీలు భక్తుల కోసం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. భజనలు, కీర్తనలతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి.