ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
MLG: వాజేడులో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు పెద్ది జగపతి బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదగడం గర్వకారణమన్నారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.