ఆర్యవైశ్య భవన నిర్మాణానికి 24 లక్షలు మంజూరు
BDK: పాల్వంచలో ఆర్యవైశ్య వన సమారాధన ఉత్సవం ఆదివారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని, ఆర్యవైశ్యుల అభ్యర్థన మేరకు పాల్వంచ పట్టణ కేంద్రంలో జిల్లా భవన నిర్మాణానికి 24 లక్షలు మంజూరు చేశారు. జిల్లాలో శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే మాట నిలబెట్టుకున్నారని ఆర్యవైశ్య నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.