ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

HNK: కాజీపేటలోని సయ్యద్ అఫ్జల్ బియబాని దర్గాలో శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.