నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

TPT: వరదయ్యపాలెం మండలంలో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం బుధవారం పర్యటించనున్నారు. కంబాక్కం గ్రామంలో ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం 10 గంటలకు ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.