'మత్స్యకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి'
AKP: ఒప్పందం ప్రకారం 500 మంది మత్స్యకారులకు ఫార్మాసిటీలో ఉద్యోగాలు ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. గురువారం మత్స్యకారులు ముత్యాలమ్మపాలెంలో సమావేశం అయ్యారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఫార్మాసిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. రసాయనిక వ్యర్ధ జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నందున మత్స్య సంపద నాశనం అవుతుందన్నారు. వ్యర్థ జలాలను విడుదల చేయడం అరికట్టాలన్నారు.