కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న శ్రీ లీల
VSP: మార్గశిర మాసం నేపథ్యంలో విశాఖ బురుజుపేటలో వెలిసిన ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతున్నాయి. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని ఆదివారం సాయంత్రం హీరోయిన్ శ్రీ లీల దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన శ్రీ లీలకు ఆలయ ఈవో శోభరాణి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.