పాల్వంచ పెద్దమ్మ తల్లికి సువర్ణ పుష్పార్చన
BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలో కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయంలో గురువారం 108 పుష్పాలతో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన పూజలు జరిపినట్లు అర్చకులు తెలిపారు. ఆలయ ఈవో రజిని కుమారి ఆదేశాల మేరకు అమ్మవారికి హారతి, మంత్రపుష్పం నివేదన తదితర పూజలు జరిపారు. కార్తీకమాస ఉత్సవం సందర్భంగా శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి పూజలు నిర్వహించారు.