రైతు ఖాతాల్లోకి రూ.8.39 కోట్లు విడుదల
E.G: తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ పంపిణీలో కలెక్టర్ కీర్తి చేకూరి, MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మూడో విడత కింద 14,884 మంది రైతులకు రూ.8.39 కోట్లు జమ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఏటా రూ.20,000 పెట్టుబడి సాయం అందించి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమని వెల్లడించారు.