రేషన్ లబ్దిదారులకు శుభవార్త

రేషన్ లబ్దిదారులకు శుభవార్త

ప్రకాశం: జిల్లాలోని రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత రెండు నెలలుగా ఈ-కేవైసీ చేయించుకోని వారికి మరో రెండు నెలల పాటు ఈ గడువును పొడిగించినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. జూన్ నెలాఖరుకల్లా ప్రతి ఒక్క రేషన్ లబ్ధిదారుడు ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇంకా 1.22 లక్షల మంది ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందని తెలిపారు.