విద్యుత్ సరఫరాకు అంతరాయం
PDPL :పెద్దపల్లి పట్టణంలో సోమవారం విద్యుత్ అంతరాయం కలుగుతుందని, ఏఈ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంతానికి విద్యుత్ సరఫరా అందిస్తున్న 11.30 కేవీ టౌన్-2 ఫీడర్‌పై మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.