మల్లికార్జున స్వామి దర్శించుకున్న యాదవ నేత
HNK: ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామిని ఆదివారం యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అలాగే సంక్షేమ పథకాలలో యాదవులకు ప్రాధాన్య ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.