'ది ఎలైట్ ట్రియో'.. ప్రపంచ కప్ వీరుల సరసన హర్మన్
హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయం ఆమెను భారతదేశ ఎలైట్ ప్రపంచ కప్ సర్కిల్‌లో చేర్చింది. 1983లో కపిల్ దేవ్, 2011లో ఎంఎస్ ధోని, తాజాగా (2025లో) హర్మన్‌ప్రీత్ కౌర్... ఈ ముగ్గురు గొప్ప సారథులు భారత క్రికెట్ చరిత్రలో ప్రపంచ కప్ గెలిచి 'ది ఎలైట్ ట్రియో'గా నిలిచారు.