బాన్సువాడ పట్టణంలో భారీగా పొగమంచు

KMR: బాన్సువాడ పట్టణాన్ని సోమవారం ఉదయం పొగ మంచు కమ్మేసింది. కొన్ని రోజులుగా తుఫాన్ ప్రభావంతో చలితోపాటు పొగమంచు తగ్గింది. సోమవారం పొగమంచు వల్ల సమీపాన ఉన్న దృశ్యాలు సైతం కనిపించలేవు. వాహనదారులు పొగమంచుతో ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు పిల్లలు చలితో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.