హైదరాబాదులో చేప ప్రసాదం పంపిణీ

HYD: ప్రతి ఏడాది జరిగే చేప ప్రసాదం పంపిణీకి తేదీలు ఖరారయ్యాయి. జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం జరగనుంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ఈ మందును అందించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రసాదం కోసం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు రానున్నారు.