బురుద నీరే దిక్కు

బురుద నీరే దిక్కు

ASR: ఇటీవల కురిసిన వర్షాలకు గూడెంకొత్తవీధి మండలం జెర్రెల పంచాయతీ కొండకించoగి గ్రామంలో గిరిజనులకు బురద నీరు దిక్కవుతోంది. గ్రామంలో సురక్షిత తాగునీరు లేకపోవడంతో స్థానికులు చెలమ చేసుకుని దానిలో నీటిని తాగుతున్నారు. వర్షాలకు కాలువలు ఉధృతం కావడంతో చెలమ అంతా బురద నీటితో నిండిపోయింది. దీంతో గత్యంతరం లేక ఆ నీటినే తీసుకెళ్లి మరగబెట్టుకుంటున్నారు.