'బీజేపీ విధానాలతో దళితుల మనుగడకు ముప్పు'
KNR: భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక, అభివృద్ధి నిరోధక విధానాలను ఎండగడుతూ ఉద్యమించేందుకు దళితులంతా ఏకం కావాలని ఏఐసీసీ జాతీయ ఎస్సీ విభాగం అధ్యక్షుడు రాజేంద్ర పాల్ గౌతమ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు.