శ్రీశ్రీశ్రీ దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
VZM: ఎల్.కోట మండలం సంతపేట గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ దుర్గమ్మ అమ్మవారిని తీర్థ మహోత్సవం సందర్బంగా ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సతి సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ పురోహితుడు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలు అందజేశారు. గ్రామస్తులు ముందుగా గ్రామంలోకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏ.ఎం. సి. చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.