నేడు సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర

TG: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో జరగనుంది. అభిమానుల సందర్శనార్థం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు CPI రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమ యాత్ర చేపట్టి భౌతికకాయాన్ని కాలేజీకి అప్పగించనున్నారు. ఆయన నేత్రాలను LV ప్రసాద్ కంటి ఆస్పత్రికి కుటుంబసభ్యులు అందించనున్నారు.