‘ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’
PPM: ముస్లిం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని MLA బోనెల విజయ్ చంద్ర అన్నారు. సోమవారం స్థానిక జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.