ఎన్నికల ప్రచారాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై

ఎన్నికల  ప్రచారాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై

MDK: అల్లాదుర్గం మండలంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు తమ ప్రచారం, పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలు, మైకుల వినియోగానికి సంబంధించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని  SI శంకర్ అన్నారు. ఈ మేరకు మండల తహశీల్దార్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తహశీల్దార్ ద్వారానే వారికి అనుమతులు లభిస్తాయని, నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.