విద్యుత్ సమస్యలపై MLA భాష్యం సమీక్ష

విద్యుత్ సమస్యలపై MLA భాష్యం సమీక్ష

PLD: పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.