పోలమాంబ ఆలయ ఈవోగా రాజగోపాల్ రెడ్డి
VSP: పెదవాల్తేరులో గల ప్రసిద్ధ శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ ఈవోగా టీ. రాజగోపాల్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈవోగా పనిచేసిన కొవ్వూరి గాయత్రి సెలవుపై వెళ్లడంతో, ఆమె స్థానంలో రాజగోపాల్ రెడ్డిని నియమించారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఈవో తెలిపారు.