నెల్లూరులో దారుణ ఘటన
నెల్లూరు: నక్కలోళ్ళ సెంటర్ వద్ద ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్, కండక్టర్ లపై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేసి గొంతు కోశారు. బైకు అడ్డంగా ఉందని చెప్పడమే వాగ్వాదానికి కారణమైంది. గాయపడిన డ్రైవర్ మన్సూర్, కండక్టర్ సలీమ్ లను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.