కారు, బైక్ ఢీ.. అయ్యప్ప స్వాములకు గాయాలు

కారు, బైక్ ఢీ.. అయ్యప్ప స్వాములకు గాయాలు

KNR: మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారులు బత్తిని వీరస్వామి, నందికొండ రెడ్డి గూడెంగుట్ట నుంచి తిరిగి వస్తుండగా నీరుకుల బ్రిడ్జి వద్ద వారి బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌లో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు KNR తరలించారు.