నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
SRPT: విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు కారణంగా ఇవాళ సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం నెలకొంటుందని ఏఈ యశ్వంత్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎంజీరోడ్డు, నిర్మల ఆసుపత్రి రోడ్డు, స్పందన కళాశాల పరిధి, కొత్తబస్టాండ్, కుడకుడరోడ్డులో అంతరాయం ఉంటుందన్నారు.