రామారావుపేటలో టీడీపీలోకి చేరికలు

KKD: తొండంగి మండలం రామారావుపేటకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు యనమల రాజేష్ పర్యవేక్షణలో మంగళవారం టీడీపీలో చేరారు. తేటగుంట పార్టీ క్యాంపు కార్యాలయంలో TDP పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ విధి విధానాలకు కట్టుబడి అందరూ కలిసికట్టుగా పని చేద్దామంటూ పిలుపునిచ్చారు.