'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

KKD: ఏలేరు జలాశయానికి ఇన్ ప్లో పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఇర్రిపాకలో ఇరిగేషన్, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో కలిసి ఏలేరు ఏటిగట్లను పటిష్ఠపరిచే చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.