గాంధీలో చిన్నారులకు ఈ సేవలు ఫ్రీ
HYD: పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు నిన్నటి నుంచి గాంధీ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ కింద 0-5 పిల్లలకు ఈ సేవలు అందిస్తున్నారు. 40 మంది చిన్నారులకు DECలోపే ఆపరేషన్లు పూర్తిచేస్తామని డా. భూపేందర్ రాథోడ్ తెలిపారు. రూ.10 లక్షల విలువైన ఈ సర్జరీ గాంధీలో ఉచితంగా అందడం పేద కుటుంబాలకు వరమని డా. వాణి చెప్పారు.