నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

KDP: పులివెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డు, అంబకపల్లె రోడ్డు, బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాలలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని విద్యుత్ ఏఈ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శుక్రవారం ఏఈ పేర్కొన్నారు.