బెంగాల్‌లో 'సామూహిక గీతా పారాయణం'

బెంగాల్‌లో 'సామూహిక గీతా పారాయణం'

కోల్‌కతాలోని 'బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌'లో సామూహిక 'గీతా పారాయణం' కార్యక్రమాన్ని నిర్వహించారు. 'సనాతన సంస్కృతి సంసద్' అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ హాజరై భగవద్గీత శ్లోకాలు పఠించారు. ఈ కార్యక్రమంలో 6.5 లక్షల మంది పాల్గొన్నట్లు బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ తెలిపారు.