విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.3.48 లక్షలు
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,48,433 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 179 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 37 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1485 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.