పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
AP: పోలవరం జడ్డంగి ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. కోసూరివారివీధి గ్రామంలో లేగదూడపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రాకర్ ద్వారా పులి కదలికలను గుర్తిస్తున్నారు.