అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో పట్టివేత

GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 టన్నుల వరకు బియ్యం ఉందని ప్రాథమికంగా అంచనా. డ్రైవర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. ఆటో ఏ ప్రాంతానికి చెందినది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపై విచారణ కొనసాగుతోంది.