నేడు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించండి
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకోసం ఆదివారం కూడా విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం కల్పించినట్లు ఎస్ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లు కట్టించుకునే కౌంటర్లు ఓపెన్ గా ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.