'ఘనంగా కన్యకా పరమేశ్వరి కుంకుమ పూజలు'

అనకాపల్లి: మాడుగుల గ్రామంలో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతకుముందు అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనేక మంది భక్తులు ముఖ్యంగా మహిళలు ఎక్కువమంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.