VIDEO: ముమ్మరంగా దోమల నివారణ చర్యలు
MDK: రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్లో సర్పంచ్ కిచ్చయ్య గారి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. శనివారం గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ పురవీధుల గుండా దోమల మందును (ఫాగింగ్) పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.