' ఈనెల 30 వరకు అడ్మిషన్‌లకు అవకాశం'
VKB: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషను ఈనెల 30 వరకు అవకాశం ఉందని తాండూరు నంబర్ వన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ తెలిపారు. వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసినవారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అడ్మిషన్ల పూర్తి వివరాలకు పాఠశాల ఓపెన్ స్కూల్ ఇన్‌ఛార్జ్ మహేష్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.