గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కోనసీమ: కపిలేశ్వరపురం మండలం లోని కోరుమిల్లి-వాకతిప్ప రోడ్డులో మృతదేహం కలకలం రేపింది. ఓ గడ్డి వాము వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.