'స్టేడియంని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం'

TPT: గూడూరు పట్టణంలో ఉన్న అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గురువారం ఉదయం గూడూరు శాసనసభ్యులు డా.పాశం సునీల్ కుమార్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావు వాకింగ్ చేశారు. వారు వాకర్స్, క్రీడాకారులు యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేడియంని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.