ఆళ్లగడ్డ హత్య కేసులో ముద్దాయి అరెస్ట్
NDL: ఆళ్లగడ్డలోని చాంద్ వీధిలో గురువారం భార్య పుష్పలత(35)ను కత్తెరతో గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన ఘటనలో ముద్దాయి భర్త చెన్నయ్యను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. టౌన్ పీఎస్లో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి హైవేలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు.