శైవ క్షేత్రాలకు ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు: డీఏం

CTR: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు సర్వీసులు నడపనున్నట్లు RTC-DM సుధాకరయ్య శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 26,27వ తేదీల్లో సోమల (M) పెద్ద ఉప్పరపల్లి దుర్గం కొండకు, పుంగనూరు, చౌడేపల్లి నుంచి శ్రీ అగస్తీశ్వర స్వామి కొండకు ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు డిపో తరఫున బస్సులు నడుస్తాయని చెప్పారు.