'బాల్య వివాహాలను అరికట్టాలి'

'బాల్య వివాహాలను అరికట్టాలి'

SRPT: 100 రోజుల ప్రణాళికలో భాగంగా బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట పోలీస్ భరోసా సెంటర్‌లో పోలీసు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. బాలల హక్కుల రక్షణ, బాల్య వివాహాల నిర్మూలన కోసం 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తామన్నారు.