అదుపుతప్పి ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

అదుపుతప్పి ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి

NTR: ఏ.కొండూరు మండలం కృష్ణారావు పాలెం శివారు జాతీయ రహదారిపై గురువారం ఆటో బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తిరువూరు నుంచి ఆటో పుల్లూరు వైపు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సగుర్తి గోపాలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్ధాలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.