'కలుషిత నీటి సమస్య లేకుండా చూడాలి'

GNTR: గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాపై ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కలుషితనీటి సరఫరాపై ఫిర్యాదులు అందితే యుద్ద ప్రాతిపదికన స్పందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. రెడ్ల బజార్, పాత గుంటూరు, కుందుల రోడ్, జేకేసి కాలేజీ రోడ్, శ్రీనివాసరావు తోట ప్రాంతాల్లో గురువారం కమిషనర్ పర్యటించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.