జాతీయ రహదారిపై ప్రమాదం.. యువకుడి మృతి

జాతీయ రహదారిపై ప్రమాదం.. యువకుడి మృతి

GDWL: ఉండవెల్లి శివారులోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఉండవెల్లికి చెందిన రాజు (చింటు) (36) అనే వ్యక్తి బైక్‌పై కర్నూలు వెళ్తుండగా, అతివేగంగా వస్తున్న స్కార్పియో ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రాజును కర్నూలు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. రాజు సంతోష్ నగర్‌లోని లాడ్జిలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు.